Monday, April 29, 2024

మ‌రోసారి వంట‌నూనెల ధ‌ర‌ల‌కి రెక్క‌లు – సామాన్య కుటుంబాల‌పై భారం

మ‌రోసారి వంట నూనెల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దాంతో సామాన్య కుటుంబాల‌పై మ‌ళ్ళీ భారం ప‌డ‌క‌త‌ప్ప‌దు. కాగా భార‌త్ కు ఎక్కువ‌గా ఇండోనేషియా నుంచే ఆయిల్స్ దిగుమ‌తి అవుతుంటాయి. దాదాపుగా ఇండియా 60 శాతం పామాయిల్ ను దిగుమతి చేసుకుంటే.. దీంట్లో సింహభాగం ఇండోనేషియా నుంచే వస్తోంది. అయితే తాజాగా ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశం నుంచి ఎగుమతులను తగ్గించాలని నిర్ణయించింది. తమ దేశంలో వంట నూనెల ధరలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియాపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించనుంది. దీంతో రానున్న కాలంలో ఇండియాలో వంట నూనెల ధరలకు మళ్లీ రెక్కలు రానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement