Tuesday, May 14, 2024

గ్యాంగ్ వార్ కాదు, తాగి గొడవపడ్డరు అంతే.. నిందితుల‌పై కేసు న‌మోదు: సీపీ సత్యనారాయణ

కరీంనగర్ క్రైం (ప్రభా న్యూస్): కరీంనగర్ బై పాస్ రోడ్ లో ఇరువర్గాలు మధ్య జరిగిన గొడవ గ్యాంగ్ వార్ కాదని, మద్యం మత్తులో జరిగిన అల్ల‌రి మాత్రమేనని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బుధవారం రాత్రి జరిగిన గొడవలో రౌడీ షీటర్ లవన్ కుమార్ తో పాటు 8 మందిపై కేసు నమోదు చేశామన్నారు. రాంనగర్ లో నివాస ముండే బోయిని లవణ కుమార్ అసాంఘిక కార్య కలాపాలు పాల్పడడంతో అతనిపై గతంలో పలు కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్ కూడా కరీంనగర్ -2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ చేయడం జరిగిందన్నారు. కొంత కాలంగా రౌడీ షీటర్ పై నిఘా తీవ్రంగా ఉండటంతో అతను హైదరాబాద్ లో ఉంటున్నాడన్నారు.

బుధవారం రాత్రి కరీంనగర్ కు వచ్చిన లవణ కుమార్ అతని మిత్రులతో కలిసి సిటీ శివారులో మద్యం సేవించినారన్నారు. తాగిన మైకంలో అందరూ గొడవ పడడంతో బోయిని లవణ కుమార్ కత్తితో అఖిల్ అనే వ్యక్తి పై దాడి చేసి గాయ పరచాడని, అఖిల్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ -1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన‌ట్టు తెలిపారు. ఈ ఘటనపై గ్యాంగ్ వార్ అని , ఇరు వర్గాలు తల్వార్లతో దాడి అని సోషల్ మీడియాలో ఉదయం నుండి చక్కర్లు కొడుతున్న విషయంలో వాస్తవం లేదన్నారు.
ఇది కేవలం లవణ కుమార్, అతని మిత్రులు తాగిన మత్తులో జరిగిన గొడవనే కాని, గ్యాంగ్ వార్ లాంటి ఘటన కాదన్నారు సీపీ. అయినా కరినగర్ లాంటి సిటీలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, ఎవరైనా అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చ‌ర్య‌లుంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మందిని అదుపు లోకి తీసుకున్నామని, ఇంకా ఎంత మంది ఉన్నారనే విషయంపై విచారణ జరుపుతున్నామని సీపీ స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement