Monday, April 29, 2024

యోగీ ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేక అతిథిగా మోడీ

ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎంగా యోగీ ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని వాజ్‌పేయి ఏకనా క్రికెట్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, మరికొందరు బీజేపీ కీలక నేతలు వస్తున్నారు. స్టేజీపై మోడీ, నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, యోగీ ఫొటోలతో కూడిన భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు పాలుపంచుకుంటారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌, కంగనా రనౌత్‌, బోనీ కపూర్‌లకు కూడా ఆహ్వానం వెళ్లింది.

అదనంగా 20వేల కుర్చీలు..

తాజాగా భారీ హిట్‌ సాధించిన కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర యూనిట్‌ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్శణగా నిలవనుంది. నటుడు అనుపమ్‌ ఖేర్‌తో పాటు వివేక్‌ అగ్నిహోత్రీకి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. స్టేడియంలో అదనంగా 20వేల కుర్చీలను వేయించారు. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో బీజేపీ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. యూపీలో దాదాపు 37 ఏళ్ల తరువాత.. ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకుని తిరిగి సీఎం పదవిని చేపడుతున్న ఘనత యోగీ ఆదిత్యనాథ్‌కు దక్కింది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లిd ఎన్నికల్లో 255 సీట్లు బీజేపీ సాధించింది. 41.29 శాతం ఓట్లు వచ్చాయి. ఈ కార్యక్రమానికి దేశంలోని 50 వ్యాపార సంస్థల యజమానులు కూడా హాజరవుతున్నారు. వీరిలో టాటా గ్రూప్‌, అంబానీ గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌, అదానీ గ్రూప్‌, మహీంద్రా గ్రూప్‌, ఐటీసీ గ్రూప్‌, పెప్సికో, హిందుస్తాన్‌ యూనిలీవర్‌ గ్రూప్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఐజీఎల్‌ గ్రూప్‌ ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement