Tuesday, May 7, 2024

ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం : బ‌హిరంగ ప్ర‌దేశాల్లో న‌వ్వితే క‌ఠిన శిక్ష : ఎందుకో తెలుసా

ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా సంచ‌ల‌నమే. అంతేకాదు ఆయ‌న నిర్ణ‌యాల‌న్నీ క‌ఠినంగా కూడా ఉంటాయి. ప్ర‌జ‌ల‌ని ఇబ్బందుల‌కి గురి చేస్తుంటాయి. కాగా ఇప్పుడు కిమ్ తీసుకున్న నిర్ణ‌యానికి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. బ‌హిరంగ‌ప్ర‌దేశాల్లో న‌వ్వ‌డంపై నిషేధం విధించారు. అంతేకాదు నేటి నుంచే ఈ ఆదేశాలు అమ‌లు అవుతాయ‌ని చెప్పారు.కేవ‌లం న‌వ్వ‌డం పై మాత్ర‌మే కాదు మ‌ద్యం సేవించ‌డం, స‌రుకులు కొనేందుకు షాపింగ్ కు వెళ్ల‌డం, విశ్రాంతి కార్య‌క్ర‌మాల్లో… పాల్గొన‌డంపై కూడా నిషేధం విధించారు. ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు ఈ ఆదేశాలు అమ‌ల్లో ఉండ‌నున్న‌ట్లు.. తెలిపింది కిమ్ స‌ర్కార్‌. దీనిని ఎవ‌రైనా ఉల్లంఘిస్తే.. ప‌రిణామాలు ఉంటాయ‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

దీనికి కార‌ణం కూడా ఉందండోయ్.. ఆ దేశ మాజీ దేశాధ్య‌క్షుడు.. కిమ్ జాంగ్ 2… ఆయ‌న భౌతికంగా దూర‌మ‌యి అంటే ఆయ‌న మ‌ర‌ణించి 10 ఏళ్లు గ‌డిచింది. ఆయ‌న 10 వ‌ర్ధంతి సంద‌ర్భంగా 10 రోజుల పాటు న‌వ్వ‌కుండా నిషేధం విధించారు. కిమ్ జోంగ్ ఇల్ డిసెంబర్ 17న మరణించారు. ఆయన 1994 నుంచి 2011 వరకు దేశాన్ని పాలించారు. ఆయన తర్వాత ప్రస్తుత సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు తీసుకున్నారు. అందుకోసమే ఈ నెల ప్రారంభంలోనే విచిత్రమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ సంతాప దినాల కాలంలో ఎవరైనా మరణించినా.. వారి కుటుంబ సభ్యులు బిగ్గరగా ఏడవరాదు. పుట్టిన రోజులు జరుపుకోరాదు. ఉత్తర కొరియాకు చెందిన మరొకరు ఈ నిబంధనల గురించి మాట్లాడుతూ, ఈ సంతాప దినాల్లో ఎవరైనా సరిపడా విచారం వ్యక్తం చేయనివారిపైనా నిఘా వేయాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయని వివరించారు. డిసెంబర్ నెల ప్రారంభం నుంచి కిమ్ జోంగ్ ఇల్ మరణంపై సామూహిక విచారానికి భంగం కలిగిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఇవి పోలీసులకు ప్రత్యేక విధులుగా ఈ నెలలో ఉండనున్నాయి. అంతేకాదు, శాంతి సుస్థిరత కోసం పని చేసే ఈ అధికారులు ఈ కాలంలో అసలు పడుకోవద్దనే ఆదేశాలూ ఉన్నాయని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement