Thursday, May 9, 2024

పార్లమెంట్ కు నితిన్ గ‌డ్క‌రీ – ఆయ‌న వ‌చ్చిన కారు చాలా స్పెష‌ల్

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ కు తీసుకువచ్చిన కార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. హైడ్రోజన్ తో నడిచే కారులో గడ్కరీ పార్లమెంట్ కు వచ్చారు. ఈ కారు పేరు ‘ మిరాయ్’ అంటే దీని అర్థం భవిష్యత్తు అని. ఇంధనాల విషయంలో స్వయం స్వావలంభన సాధించే విధంగా ఈ మిరాయ్ ఉండనుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం రూ. 3000 కోట్లలో ఈ మిషన్ ప్రారంభించిందని…త్వరలోనే హైడ్రోజన్ ఎగుమతి చేసే దేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ బొగ్గును ఉపయోగిస్తున్నామో.. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించబడుతుందని గడ్కరీ అన్నారు. భారత్ ఆత్మనిర్భర్ కావడానికి… నీటి నుంచి ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ ‘ మిరాయ్’ కారు పైలెట్ ప్రాజెక్ట్ అని అన్నారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీని ప్రారంభిస్తామని.. పెట్రోల్ వంటి ఇంధన దిగుమతులను అరికడతామని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement