Saturday, April 27, 2024

యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు : సజ్జనార్

యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉంచుతున్నామ‌ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మూలవిరాట్‌ దర్శనాలు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం ‘యాదాద్రి దర్శిని’ పేరుతో మినీ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు వచ్చే భక్తుల దర్శనార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి వందకు పైగా మినీ బస్సులను అందుబాటులో ఉంచింది. ఈరోజు ఈ నూతన బస్సు సర్వీసులను ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ వీసీ సజ్జనార్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఈ బస్సు సర్వీసుపై సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్‌కు, అక్కడి నుంచి యాదగిరి గుట్టకు మినీ బస్సులను నడుపుతామన్నారు. జేబీఎస్‌ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్‌ నుంచి రూ.75గా టికెట్‌ ధరను నిర్ణయించామని వెల్లడించారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాఫీగా సాగుతుందన్నారు. వీఆర్‌ఎస్‌కు రెండు వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. అయితే వీఆర్‌ఎస్‌ కోసం ఉద్యోగులను తాము బలవంతం చేయట్లేదన్నారు. ఎంప్లాయీస్ వీఆర్‌ఎస్‌ సంఖ్యను బట్టి ప్యాకేజీ సిద్ధం చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement