Wednesday, April 17, 2024

Flash: కోతి దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కృష్ణ థియేటర్ సమీపంలో కోతి దాడిలో మూడు సంవత్సరాల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారిపై కోతి దాడి చేయడంతో చిన్నారి తల్లిదండ్రులు భయాందోళనలు చెందారు. చిన్నారిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. కోతులు ఇంత దాడులకు పాల్పడుతున్న సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందిస్తారా లేక సంబంధిత అధికారులపై కేసులు పెట్టమంటారా అంటూ ప్రజలు హెచ్చరిస్తున్నారు. అధికారులు,అటవీశాఖ dfo, మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement