Saturday, April 27, 2024

నీకో సిప్పు.. నాకో సిప్పు.. మ‌ద్యం నోట్లో పోస్తూ హోలీ ఎంజాయ్ చేసిన ఎమ్మెల్యే

ఆయ‌నో ఎమ్మెల్యే.. ఆయ‌న‌కు మాస్ మ‌హారాజాగా పేరుంది. ఎవ్వ‌రు ఏమ‌న్నా అనుకోనీ, త‌ను ఇంతే అన్న‌ట్టు లోక‌ల్ లీడ‌ర్లు, కార్య‌క‌ర్త‌ల‌తో మ‌మేక‌మై ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే.. ఇవ్వాల జ‌రిగిన హోలీ వేడుక‌ల్లో మ‌రింత జోష్ నింపుతూ మ‌ద్యం బాటిల్‌తో హ‌ల్‌చ‌ల్ చేశారు. ఇంత‌కీ ఎవ‌రా ఎమ్మెల్యే అని ఇంకా స‌స్పెన్స్‌గా ఉందా.. మహబూబాబాద్ MLA శంకర్ నాయక్.. ఇవ్వాల త‌న‌ క్యాంపు ఆఫీసులో జరిగిన హోలీ వేడుకలలో కార్యకర్తలతో కలిసి మందు బాటిల్ తో క‌నిపించారు.
హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వం రెండు రోజులు వైన్ షాపులు బంద్ చేసినా.. ఎమ్మెల్యే నే మందు బాటిల్ తో హల్ చల్ చేయడం క‌నిపించింది. కార్య‌క‌ర్త‌లు, త‌న అనుచ‌ర లీడ‌ర్ల‌తో క‌లిసి హోలీని భ‌లే ఎంజాయ్ చేశార‌నుకోండి.. కావాలంటే ఈ వీడియో చూడండి.. ఆ కిక్కేంటో మీకే తెలుస్తుంది…

వీడియో చూడాలంటే.. www.prabhanews.com లో ఉంటుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement