Thursday, May 9, 2024

నేను హెల్దీగానే ఉన్నా.. కావాలంటే డాక్టర్​తో బాక్సింగ్​ కూడా చేస్తా: దలైలామా

బౌధ్ద మత గురువు దలైలామా హెల్త్​ బాగాలేదన్న వార్తలను కొట్టిపారేస్తూ ఆయనే స్వయంగా మీడియా ముందుకొచ్చారు. కొవిడ్ వ్యాప్తి అనంతరం ఈ రెండేళ్ల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా కనిపించిన దలైలామా శుక్రవారం తాను ఎంతో ఆరోగ్యంతో ఉన్నానని ఇప్పుడు డాక్టర్‌తో బాక్సింగ్ కూడా ఆడగలనని తెలిపారు. ఒక సభలో ప్రసంగిస్తున్నప్పుడు అతను జాతక కథల నుండి చిన్న బోధన కూడా చేశారు. దీని తర్వాత ప్రధాన టిబెటన్ దేవాలయం సుగ్లాఖాంగ్‌లో బోధిచిట్టా (సెమ్కీ)ని రూపొందించే కార్యక్రమం జరిగింది. తాను రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని, అయితే  ఆరోగ్యం బాగానే ఉన్న కారణంగా వెళ్లడం లేదన్నారు. ఇప్పుడు డాక్టర్‌తో బాక్సింగ్ కూడా ఆడే ఫిట్​నెస్​తో ఉన్నానని అందుకే వెళ్లలేదని చెప్పారు.

సన్యాసులు, సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (CTA) సభ్యులతో సహా వేలాది మంది టిబెటన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. CTA “చార్టర్ ఆఫ్ ది టిబెటన్స్ ఇన్-ఎక్సైల్” కింద పనిచేస్తోంది. ఇవ్వాల ఎంతో అద్భుతమైన రోజు. మేము రెండేళ్ల తర్వాత ఆయన పవిత్రతను చూడగలుగుతున్నాం. అత్యంత అదృష్ట విషయాలలో ఇది ఒకటి. ఆయన క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారన్న వార్త తెలుసుకోవడం మా అందరికి చాలా సంతోసంగా ఉంది అని CTA సభ్యుడు టెన్జింగ్ జిగ్మే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement