Monday, May 20, 2024

PBKS vs RCB | పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయం..

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన కీల‌క మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. దర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించింది. ఆర్సీబీ నిర్ధేశించిన 242 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్ జట్టు 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో బెంగళూరు జట్టు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఛేజింగ్‌లో పంజాబ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే 6 ప‌రుగుల‌కు ప్రభసిమ్రాన్ ఔటయ్యాడు. అయితే ఆ తరువాత క్రీజులోకి వ‌చ్చిన రిలే ర‌స్సో (61) మెరుపు హాఫ్ సెంచ‌రీ బాదాడు. 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదిన అత‌డు భారీ షాట్ ఆడి ఔట‌య్యాడు. దూకుడుగా ఆడుతున్న రస్సో ఔటైన తరువాత పంజాబ్ స్కోర్ నెమ్మదించింది.

జానీ బెయిర్‌స్టో (27), శ‌శాంక్ సింగ్ (37), కెప్టెన్ సామ్ కర్రాన్ (22) పరుగులు చేశారు.. ఆ తరువాత బెంగళూరు బౌలర్లు చెలరేగడంతో 17 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా… స్వప్నిల్ సింగ్, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement