Monday, April 29, 2024

న్యూ మామ్​ నేనే.. ఓ స్పెషల్​ ఫొటోని షేర్​ చేసిన ఆలియా

బాలీవుడ్​ బ్యూటీ ఆలియా భట్​ తల్లి అయ్యారు​. తమకు పాప జన్మించినట్లు రణబీర్ కపూర్‌తో కలిసి ఆలియా సంబురంగా ప్రకటించారు. తల్లి అయిన తర్వాత ఇవ్వాల (మంగళవారం) అలియా మొదటిసారి ఒక స్వీట్ పోస్ట్ ను షేర్ చేసింది. దీన్ని చూసిన అభిమానులు తల్లిగా తన మనస్తత్వం ఎంత సున్నితంగా ఉందో తెలుస్తోందని పాజిటివ్​ కామెంట్స్​ చేస్తున్నారు.  ఇక.. అలియా ‘మామా​’ అని పేరున్న ఓ టీ కప్పు ఫొటోని షేర్ చేసింది. ఆమె ఫోటోకు “ఇది నేనే” అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె తల్లిగా పారవశ్యంలో ఉందనే విషయం వెల్లడవుతోందని తెలుస్తోంది. ఈ పోస్ట్ చేసినప్పటి నుండి అభిమానులు వారి పాప ఫేస్​ని చూపించాలని ఆలియాని అడుగుతున్నారు.  

తదుపరి ప్రాజెక్టులు ఏమున్నయి?

ఆలియాకి హార్ట్ ఆఫ్ స్టోన్, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ అనే ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. ఆమె గల్లీ బాయ్ తర్వాత రణ్‌వీర్ సింగ్‌తో మళ్లీ కలిసి నటించనుంది. మరోవైపు శ్రద్దా కపూర్ నటిస్తున్న మహిళా ఓరియంటెడ్ లవ్ రంజన్ చిత్రం షూటింగ్‌లో రణబీర్ బిజీగా ఉన్నాడు.  అలియా, రణబీర్ ఇద్దరూ చాలా సంవత్సరాల డేటింగ్ తర్వాత ఏప్రిల్‌లో ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement