Tuesday, April 16, 2024

Breaking: ముందస్తు ఉండదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: సీఎం కేసీఆర్

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని.. తాము ముందస్తుకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవ్వాల (మంగళవారం) ప్రగతి భవన్ లో నిర్వహించిన కీలక సమావేశంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మంత్రి మరో ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. వంద ఓటర్లకు ఒక ఇన్ చార్జిని నియమించాలన్నారు. 10రోజుల్లో ఇన్ ఛార్జుల నియామకం పూర్తి కావాలన్నారు. బీజేపీతో ఇక యుద్దమేనని స్పష్టం చేశారు. ఈరోజు నుంచి ఎమ్మెల్యేలంతా ఫీల్డ్ లోనే ఉండాలని, క్యాలెండర్​ బేసిస్​గా వర్క్​ చేయాలని సూచించారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌తో పాటు ప‌లు అంశాల‌పై ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ చ‌ర్చించారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై స్ప‌ష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ ప్రారంభ‌మైన ఈ స‌మావేశంలో అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌న్న‌ద్ధ‌త‌తో పాటు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అంశంపై చ‌ర్చించారు.

ఎమ్మెల్యేలను మార్చే ప్ర‌స‌క్తే లేదు..

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మ‌ళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌యమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి. ప్ర‌తి ఎమ్మెల్యే నిత్యం ప్ర‌జ‌ల‌తో మాట్లాడాలి అని సూచించారు. ఏవైనా స‌మ‌స్య‌లుంటే ప్ర‌భుత్వం దృష్టికి తేవాల‌ని కేసీఆర్ సూచించారు.

- Advertisement -

వంద శాతం మ‌ళ్లీ టీఆర్ఎస్‌దే అధికారం..

స‌ర్వేల‌న్ని టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వంద శాతం మ‌ళ్లీ టీఆర్ఎస్‌దే అధికార‌మ‌ని తేల్చిచెప్పారు. మునుగోడు త‌ర‌హాలో ప‌టిష్ట ఎన్నిక‌ల వ్యూహం త‌యారు చేయాల‌ని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా ప‌ని చేయాలి. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. ల‌బ్దిదారుల పూర్తి స‌మాచారం ఎమ్మెల్యేల వ‌ద్ద ఉండాలి. ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాలి. ప్ర‌జ‌ల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించాలి. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల బ‌లంతో ఓట‌ర్లంద‌రినీ చేరుకోవాల‌ని కేసీఆర్ సూచించారు.

బీజేపీతో పోరాడాల్సిందే..

బీజేపీ నుంచి ఎదుర‌య్యే దాడిని స‌మ‌ర్థంగా తిప్పికొట్టాలి. బీజేపీతో పోరాడాల్సిందేన‌ని కేసీఆర్ చెప్పారు. ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌న ద‌గ్గ‌ర కూడా ప్ర‌య‌త్నించి అడ్డంగా దొరికారు. ఆ పార్టీ కుట్ర‌ల‌న్నింటినీ తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తోంద‌ని తెలిపారు. సీబీఐ, ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ , టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం.ఈ భేటీలో పార్టీ ఎంపీలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , పార్టీ కార్యవర్గ సభ్యులు , కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement