Wednesday, May 1, 2024

‘అక్ష‌య్ కుమార్’ పాత్ర‌పై మండిప‌డుతోన్న నెటిజ‌న్లు

బాలీవుడ్ చిత్ంర బ‌చ్చ‌న్ పాండే ఈ నెల 18న విడుద‌ల‌యింది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. కాగా ఈ చిత్రంలో హీరో అక్ష‌య్ కుమార్ హింసాత్మక నేరస్థుడిగా క‌న‌ప‌డ‌డం, ఆయ‌న ప్ర‌జ‌ల‌ను హ‌త్య‌లు చేయ‌డం వంటి సీన్లు ఉన్నాయి. ఇటువంటి సినిమాకు పాండే వంటి గొప్ప‌ యోధుడి పేరును వాడ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. #BoycottBachchhanpandey హ్యాష్‌ట్యాగ్ పేరిట పోస్టులు చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. హిందువులను కించపరిచే విధంగా అక్ష‌య్ కుమార్‌ పాత్రను చిత్రీకరించారని మండిప‌డుతున్నారు. తమిళ సినిమా ‘జిగర్తాండా’కు రీమేక్ గా తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే హిందీలో బచ్చన్‌ పాండేగా రూపొందించారు. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్, కృతి సనన్‌, అర్షద్‌ వార్సీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement