Tuesday, April 30, 2024

ఆచార్య నుండి మ‌రో వీడియో సాంగ్- దూసుకుపోతోన్న నీలాంబ‌రి సాంగ్

ఆచార్య చిత్రాన్ని మరింత రీచ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. మరోవైపు ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్స్ అందిస్తూ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్ర మ్యూజిక్ రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. తాజాగా మెగా అభిమానుల కోసం ఆచార్య నుంచి రామ్ చరణ్, పూజా హెగ్దేల రొమాంటిక్ సాంగ్ నీలంబరి ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. గతంలో ప్రొమోను విడుదల చేయగా.. తాజాగా ఎడిటెడ్ వెర్షన్ వీడియోను వదిలారు. ప్రస్తుతం ఈ సాంగ్ య్యూటూబ్ లో దూసుకుపోతోంది. దేవాలయ భూకబ్జాదారులకు వ్యతిరేకంగా సాయుధం పోరాటం చేసే రెబల్స్ పాత్రల్లో తండ్రీకొడుకులు కనిపించనున్నారు.దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఏప్రిల్ 29న చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement