Sunday, May 19, 2024

చీపురు ప‌ట్టి ఆల‌యాన్నిశుభ్రం చేసిన రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి – ద్రౌప‌ది ముర్ము

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము స్వ‌యంగా చీపురు చేత‌ప‌ట్టి ఓ ఆల‌యాన్ని శుభ్రం చేశారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక‌య్యారు ద్రౌపది ముర్ము..ఈ సంద‌ర్భంగా ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా రాయరంగ్‌పూర్‌లోని అనేక దేవాలయాలను సందర్శించారు. జగన్నాథ‌, హనుమాన్, శివాలయాలను ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ క్రమంలో పూర్ణాంధేశ్వర్ శివాలయంలో ఆమె పూజ‌లు నిర్వ‌హించారు. దీనికి ముందు ద్రౌప‌తి ముర్ము ఆల‌య ప‌రిస‌రాల్లోని నేల‌ను స్వ‌యంగా చీపురుప‌ట్టి ఊడ్చారు. అనంతరం ప్రజాపితా బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్మును ఎన్డీఏ మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌క‌టించింది. బుధ‌వారం ఆమెకు సాయుధ CRPF సిబ్బందితో కేంద్రం రౌండ్-ది క్లాక్ Z+ భద్రతను క‌ల్పించింది. నేడు సీఆర్‌పీఎఫ్ కమాండోలు ముర్ము భద్రత బాధ్య‌త‌ను స్వీక‌రించార‌ని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశాకు చెందిన గిరిజన నాయ‌కురాలు ముర్ము ఉంటారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర సీనియర్ నేతలతో కూడిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement