Sunday, May 5, 2024

డైన‌మిక్ లా ప‌ని చేయ‌డం మోడీ స్టైల్ .. కేంద్ర మంత్రి మాధ‌వ‌రావు సింథియా ..

కేంద్ర మంత్రి మాధ‌వ‌రావు సింథియా ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ , మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ల మ‌ధ్య ఉన్న తేడాని వివ‌రించారు. వారిద్ద‌రి మ‌ధ్య ఆకాశానికి .. భూమికి ఉన్నంత తేడా ఉంద‌ని కామెంట్ చేశారు. జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ , మన్మోహన్ కు మధ్య మీరు గమనించిన తేడా ఏమిటని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం ఇచ్చారు. ఫలితాలు వచ్చేలా డైనమిక్ పని చేయడం మోడీ స్టైల్ అని చెప్పారు. మోడీ పని విధానంలో డైనమిజం ఉంటుందని అన్నారు. కేంద్ర కేబినెట్లో చేరిన నాలుగు నెలల్లో తాను పరిశీలించింది ఇదేనని వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement