Sunday, April 28, 2024

Viral Video: నెత్తుటి మ‌డుగున క‌త్తులు మొల‌కెత్తిన మునుగోడు.. వైర‌ల్ అవుతున్న రాజ‌గోపాల్‌రెడ్డి పాట!

నెత్తుటి మడుగున కత్తులు మొలకెత్తిన మునుగోడు.. రాజగోపాల్​రెడ్డి నిన్ను రమ్మన్నది ఎవరు?
తిరుగుబాటు వార‌స‌త్వ‌మున్న‌ది మునుగోడు.. మ‌తోన్మాద పార్టీకి పొమ్మ‌న‌ది ఎవ‌రు?
వేల‌కోట్ల క‌మీష‌న్ల కాంట్రాక్టు వాటా కొర‌కు.. గుజ‌రాతు మొన‌గాండ్ల మొప్పుకొర‌కు త‌డిగుడ్డ‌తో గొంతుకోసేటోళ్ల చెంత చేరిన‌వు.. అంటూ ఓ వీడియో సాంగ్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది..

తెలంగాణ‌లో సాహిత్యకారులు, విప్ల‌వ భావ‌జాల‌మున్న న‌ల్ల‌గొండ జిల్లాలో ఇప్పుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి తీరుపై భ‌గ్గుమంటున్నారు చాలామంది. బీజేపీలో చేరడాన్ని ఆక్షేపిస్తున్నారు. కాంట్రాక్టులు, క‌మీష‌న్ల వాటా కోసమే బీజేపీలో చేరార‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఈ పాట వైర‌ల్‌గా మారి యావ‌త్ తెలంగాణ‌లో చ‌ర్చ‌కు దారితీస్తోంది.

వీడియో కోసం.. www.prabhanews.com లోని వీడియో సెక్షన్​లో చూడొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement