Saturday, May 11, 2024

Big Story : విలాసవంతమైన ఇళ్లకు పెరిగిన డిమాండ్‌..

కొవిడ్‌ తరువాత దేశంలో ప్రధానమైన 7 నగరాల్లో విలావంతమైన ఇళ్లకు గిరాకీ పెరిగింది. అన్‌రాక్‌ రిసెర్చ్‌ సర్వే ప్రకారం 2022 సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఈ ఏడు నగరాల్లో 1.84 లక్షల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో 14 శాతం అంఏ దాదాపు 25,700 విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. 2019లో 2.61 లక్షల ఇళ్ల అమ్మకాలు జరిగితే అందులో విలాసవంతమైన ఇళ్లు కేవలం 17,740 (7శాతం) మాత్రమే. ముంబాయి మున్సిపల్‌ రీజియన్‌, ఢిల్లి ఎన్‌సీఆర్‌ రీజియన్‌ లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు నగరాల్లోనే 17,830 విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2019లో ఇక్కడ కేవలం 11,890 విలాసవంతమైన ఇళ్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. విలావసంతమైన ఇళ్ల అమ్మకాల్లో ముంబాయి ప్రాంతతం 2019లో 13 శాతం ఉంటే, 2022లో ఇది 25 శాతానికి పెరిగింది. ఢిల్లి ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 2019లో 4 శాతం ఉంటే, 2022లో అది 12 శాతానికి పెరిగాయి.

కొవిడ్‌ తరువాత మన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని చెప్పడానికి విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఒక సూచికని అన్‌రాక్‌ ఛైర్మన్‌ అనూజ్‌ పూరీ అభిప్రాయపడ్డారు. సాధారణ బడ్జెట్‌లో ఇళ్లను కొనే వారి సంఖ్య కూడా ఆర్థిక వ్యవస్థ మెరుగైందని చెప్పడానికి నిదర్శమని చెప్పారు. విలాసవంతమైన గృహలను నిర్మిస్తున్న సంస్థలు ధరలు తగ్గించడం, డాలర్‌తో రూపాయి విలవ క్షిణించడం వల్ల ఎన్‌ఆర్‌ఐలు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఇళ్లను కొనేందుకు ముందుకు రావడం వల్లే అమ్మకాలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. రేట్లు సానుకూలంగా ఉండి అమ్మకాలు పెరగడంలో డెవలపర్స్‌ మరిన్ని కొత్త వెంచర్లను ప్రారంభించారు. 2022 మొదటి ఆరు నెలల్లోనే ఈ ఏడు నగరాల్లో 28,000 యూనిట్లను 1.5 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన నిర్మాణాలు ప్రారంభించారు. ఇదే 2019లో మొత్తం సంవత్సరంలో 28,960 కొత్త యూనిట్లు మాత్రమే ప్రారంభించారు.

అందుబాటు ధరల్లో…

మధ్య తరగి కుటుంబాలకు సైతం అందుబాటులో ఉండే 40 లక్షల లోపు లభించే ఇళ్ల అమ్మకాలు మాత్రం
స్వల్పంగా తగ్గాయి. 2019లో బడ్జెట్‌ గృహాల అమ్మకాలు, మొత్తం ఇళ్ల అమ్మకాల్లో 38 శాతం ఉంటే, 2022లో ఇది 31 శాతంగా ఉంది. 2022లో 1.84 లక్షల గృహాల అమ్మకాలు జరిగితే, అందులో 40 లక్షల లోపు ఉండేవి 57,040 యూనిట్లు ఉన్నాయి.

హైదరాబాద్‌లో భారీగా తగ్గుదల..

- Advertisement -

కొవిడ్‌ మూలంగా మధ్య తరగి ఆదాయాలు గణనీయంగా తగ్గడంతో బడ్జెట్‌ గృహాల అమ్మకాలు తగ్గిపోయాయి. సర్వే చేసిన ఏడు నగరాల్లో బడ్జెట్‌ గృహాల అమ్మకాలు హైదరాబాద్‌లో అత్యధికంగా 23 శాతం తగ్గాయి. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో బడ్జెట్‌ గృహాల అమ్మకాలు 2019లో 23 శాతం ఉంటే, 2022లో ఇది కేవలం 6 శాతంగానే ఉన్నాయి. చెన్నయ్‌లోనూ 2019లో బడ్జెట్‌ గృహాల అమ్మకాలు మొత్తం ఇళ్ల అమ్మకాల్లో 52 శాతం ఉంటే, 2022లో కేవలం 36 శాతం మాత్రమే అమ్మకాలు జరిగాయి.
అన్‌రాక్‌ వెల్లడించిన దాని ప్రకారం ప్రస్తుతం 7 ప్రధాన నగరాల్లో అగ్జరీ, ఆల్ట్రా లగ్జరీ కేటగిరిలో మొత్తం 97,140 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్‌లో 11,730 విలాసవంతమైన ఇళ్లు అమ్మకానికి ఉంటే, వాటిలో 2022 మొదటి ఆరు నెలల్లో 2,420 ఇళ్ల అమ్మకాలు జరిగాయి.

ముంబాయి మున్సిపల్‌ రీజియన్‌లో 44,710 లగ్జరీ హోమ్స్‌ అమ్మకానికి అందుబాటులో ఉంటే, 2022 మొదటి ఆరు నెలల్లో 13,670 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఢిల్లి ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో 19,470 విలాసవంతమైన ఇళ్లు అందుబాటులో ఉంటే, 2,420 ఇళ్లను విక్రయించారు. బెంగళూర్‌లో 9,860 అందుబాటులో ఉంటే, వాటిలో 2,430 విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. పూణలో 5,860 అందుబాటులో ఉంటే 1460 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. చెన్నయ్‌లో 4,020 అందుబాటులో ఉంటే, వాటిలో 920 విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. కోల్‌కతాలో 1490 అందుబాటులో ఉంటే 630 విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు జరిగాయని అన్‌రాక్‌ సంస్థ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement