Wednesday, May 15, 2024

Spl Story: MRSA అనే అంటువ్యాధి.. పందుల నుంచి మనుషులకు అటాక్, హెచ్చరిస్తున్న సైంటిస్టులు!

మెథిసిలిస్​ రెసిస్టెంట్​ స్టెఫిలోకాకస్​ ఆరియస్​ (MRSA) అనే అంటువ్యాధి.. పందుల నుంచి మనుషులకు సోకుతోంది. ఈ బ్యాక్టీరియా మొండి వ్యాధిగా మారి పందుల నుంచి మానవులకు స్పీడ్​గా సంక్రమిస్తోంది. దీనిపై జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు వైద్య పరిశోధకులు. పందుల పెంపకానికి వాడే యాంటీబయోటిక్స్​ మితిమీరడంతో ఇది మొండి వ్యాధిగా, నయం చేయలేని జబ్బుగా మారిందని చెబుతన్నారు. ప్రపంచాన్ని ఒకవైపు కరోనా కుదిపేస్తుంటే.. ఇప్పుడు మరో అంటువ్యాధి సోకుతుందన్న వార్తలు, డబ్ల్యూహెచ్​వో హెక్చరికలు ప్రజలకు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

– డిజిటల్​ మీడియా విభాగం, ఆంధ్రప్రభ

CC398 అని పిలిచే మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ (MRSA) అనే మొండి వ్యాధి ఇప్పుడు మానవ జీవితాలను ఛిన్నాభిన్నం చేసేందుకు వస్తోంది. యాంటీ బయాటిక్- మందులేవీ దీనిపై ప్రభావం చూపడం లేదని పరిశోధనల బృందం తెలిపింది. బహుశా పందుల పెంపకంలో భాగంగా మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగం వల్ల ఇలా మొండి వ్యాధిగా మారి ఉండొచ్చని భావిస్తున్నారు. గత 50 ఏండ్లలో CC398 అనేది యూరోపియన్ పశువులలో MRSA యొక్క ప్రధాన రకంగా మారింది. ఇది పందులలోనే కాకుండా ఇతర జంతువులకూ వేగంగా వ్యాపిస్తోంది. ఇంతకుముందు పశువులతో ప్రత్యక్ష సంబంధం లేని పక్షి జాతిలో కూడా ఇట్లాంటి అంటువ్యాధి ఉండేదని, దాని యాంటీబయాటిక్ నిరోధకతను కొనసాగిస్తూనే ఇది మానవులకు సోకే గుణం కలిగి ఉంటుందని వైద్య బృందం చెబుతోంది. ఇది ఇప్పుడు ప్రజారోగ్యానికి పెను ముప్పును కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

‘‘పందుల పెంపకంలో అధిక స్థాయిలో యాంటీబయాటిక్స్​ వాడకమే MRSA జాతిలో మరో పరిణామానికి దారితీసింది. ఈ పశువుల-సంబంధిత MRSAలో యాంటీబయాటిక్ నిరోధకత చాలా స్థిరంగా ఉందని మేము కనుగొన్నాం. – ఇది అనేక దశాబ్దాలుగా కొనసాగింది. బ్యాక్టీరియా వివిధ పశువుల జాతులలో వ్యాపించింది ” అని అధ్యయనంలో పాల్గొన్న ప్రధాన రచయిత గెమ్మా ముర్రే తెలిపారు.

ఐరోపాలో యాంటీబయాటిక్ వాడకం తగ్గినప్పటికీ విధాన మార్పులకు ప్రతిస్పందనగా సూక్ష్మజీవి యొక్క స్థిరత్వం కారణంగా పందులలో MRSA ఉనికిపై పరిమిత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. CC398 అన్ని పశువులలో కనిపించనప్పటికీ.. ఇది పందుల సంచారం ఉన్న ప్రదేశాల్లో కానీ, పంది మాంసం తిన్న వారికి కానీ సోకేందుకు ఎక్కువ చాన్సెస్​ ఉన్నాయి. డెన్మార్క్ లో MRSAపై యాంటిబయోటిక్​ వాడకం ఎంతగా పెరిగిందంటే.. 2009లో 5శాతం ఉంటే.. అది 2018లో 90శాతానికి పెరిగింది.

- Advertisement -

యూరోపియన్ పశువులలో CC398 యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది.. అది మొండి జబ్బుగా ఎలా పరిణమించింది అనేది అర్థం చేసుకోవడంతోపాటు మానవులకు సంక్రమించే దాని సామర్థ్యం, – ప్రజారోగ్యానికి అది కలిగించే ప్రమాదాన్ని అంచనా వేయడం ఇప్పుడు ఎంతో ముఖ్యమైన అంశమని పరిశోధనల్లో పాల్గొన్న సీనియర్ రచయిత లూసీ వీనెర్ట్ అన్నారు. MRSAని  మొదటిసారి 1960లలో మానవులలో గుర్తించారని, ఇతర బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కంటే దీనికి చికిత్స చేయడం చాలా కష్టం అని ఆయన తెలిపారు. మానవ ఆరోగ్యానికి MRSAని అతిపెద్ద ముప్పుగా WHO పరిగణించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement