Sunday, May 5, 2024

చీరతో ఫుట్ బాల్ ఆడిన ఎంపీ మ‌హువా మొయిత్రా-వైర‌ల్ గా ఫొటోస్

చీర క‌ట్టులో ఫుట్ బాల్ ఆడారు ఓ మహిళా ఎంపీ. ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా.ఆమె చీర కట్టుకొని ఫుట్ బాల్ ఆడుతున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఓ చేత్తో చీర పట్టుకొని కాలితో ఫుట్ బాల్ ఆడుతున్న ఫోటోలను ఎంపీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఖేలా హోబ్ డిబాస్ కోసం కికింగ్ ఇట్ ఆఫ్’’ అనే క్యాప్షన్ తో ఫోటోలను షేర్ చేశారు. ఆగస్టు 16వతేదీన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ‘ఖేలా హోబే దివస్’ పాటించాలని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మహువా పాల్గొని సందడి చేశారు. ఆమె ఆట తీరుకు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement