Friday, April 26, 2024

విదేశీ ప‌ర్య‌ట‌న‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి – జీన్స్..టీష‌ర్ట్ లో మెరిసిన ఎంపీ

విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మేధోమ‌థ‌న స‌ద‌స్సు జ‌రుగుతుంటే…కోమ‌టిరెడ్డి మాత్రం ఎంచ‌క్కా ఫారిన్ టూర్‌కు చెక్కేశారు. క్రొయేషియాలో ఉన్న కోమ‌టిరెడ్డి… ఆ దేశ ప్రధాన న‌గ‌రం కోవింజ్‌లోని సెయింట్ యూఫేమియా చ‌ర్చిని సంద‌ర్శించారు. చ‌ర్చిలో తాను తీయించుకున్న ఫొటోల‌ను కోమ‌టిరెడ్డే స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో ఖ‌ద్దరు వ‌దిలేసిన కోమ‌టిరెడ్డి…ఎంచ‌క్కా జీన్స్, టీ ష‌ర్ట్‌లో కాలేజీ కుర్రాడిలా క‌నిపిస్తున్నారు. సెయింట్ యూఫేమియా చ‌ర్చిని బాసిలికా ఆఫ్ సెయింట్ యూఫేమియాని కూడా పిలుస్తారంటూ ఆయ‌న కామెంట్ పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement