Saturday, May 4, 2024

Movie: సూప‌ర్ స్టార్ రజినీకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..

National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డున ప్రదానోత్సవం ఘ‌నంగా జ‌రుగుతోంది. సూప‌ర్ స్టార్ రజినీని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వ‌రించింది. సినీ వినీలాకాశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో ఎంతో ఘనంగా జరుగుతోంది. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‏లో కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. కార్యక్రమానికి భారతీయ సినీ రంగంలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులతోపాటు.. ఉత్తమ చిత్రాల‌కు అవార్డులు అందచేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప‌ల‌వురు ఈ అవార్డులు అందుకున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ అత్యంత విశిష్టమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సొంతం చేసుకున్నారు. నాలుగు దశాబ్ధాలకు పైగా సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు ర‌జినీ. కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా సినీ పరిశ్రమలో నిజంగానే సూపర్ స్టార్.

ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తలైవా. సినీ కళామతల్లికి రజినీ అందిస్తున్న విశేష సేవలకుగానూ కేంద్రం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా.. రజినీ తనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement