Thursday, May 2, 2024

దేశంలోనే మోస్ట్ పాపుల‌ర్ సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ – స్టాలిన్ కి మూడోస్థానం

ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ దేశంలోనే మోస్ట్ పాపుల‌ర్ సీఎంగా ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచారు. కాగా ఆ రాష్ట్రంలో 71.1శాతం మంది సీఎంకి ఓట్లు వేశారు. ప‌లు రాష్ట్రాల సీఎంల పాపులారిటీపై రాష్ట్రాల వారిగా ఇండియా టుడే చేసిన మూడ్ ఆఫ్ ద నేష‌న్ స‌ర్వేలో ఈ విష‌యం తేలింది. ఈ జాబితాలో మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టాప్ టెన్ లోనే చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. ఒడిశాలో 2,743 మందిని అభిప్రాయాలు అడగ్గా.. 71.1 శాతం మంది నవీన్ పట్నాయక్ కే మొగ్గు చూపారు. నవీన్ పట్నాయక్ తర్వాతి స్థానాల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ లు ఉన్నారు.

బెంగాల్ లో 4,982 మందిని ప్రశ్నించగా.. 69.9 శాతం మంది మమతా బెనర్జీ పాప్యులర్ సీఎంగా ఓటేశారు. తమిళనాడులో స్టాలిన్ కు అనుకూలంగా 67.5 శాతం మంది ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి 61.8 శాతం, కేరళ సీఎం పినరయి విజయన్ కు 61.1 శాతం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 57.9 శాతం, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు 56.6%, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కు 51.4 శాతం మంది ఆమోదం తెలిపారు. 44.9 శాతం ఓట్లతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement