Sunday, May 5, 2024

మునగాకుతో మన శరీరానికి ఎంతో మేలు ..

ప్రభన్యూస్ : మునకాయతో పాటు మునగాకు కూడా ఎంతో మంచిది. దీని వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అసలు ఈ మునకాయ మొక్క ఎక్కడ నుంచి వచ్చిందో చూద్దాం.. మునగ అనేది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక మొక్క. ఇది ఆసియా, ఆఫ్రికా వంటి ఇతర ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల ప్రదేశాల్లో కూడా పెరుగుతుంది. జానపద ఔషధాల్లో శతాబ్దాలుగా ఈ మొక్క ఆకులు, పువ్వులు, విత్తనాలను ఉపయోగిస్తున్నారు. ఇవి మధుమేహం, దీర్ఘకాలిక మంట, బాక్టీరియల్‌, వైరల్‌, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, కీళ్ళ నొప్పి, గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ర్‌, ఆర్థరైటిస్‌, అధిక రక్త పోటు, ఔషధాల వల్ల కాలేయం దెబ్బతినడం, కడుపు పూతలు, ఆస్తమా, గాయం మాన్పుట, వ్రణోత్పత్తి నిరోధించడానికి, పెద్దప్రేగు కాన్సర్‌, అతిసారం వంటి రోగాలను నయం చేయడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మునగాకులో చాలా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఆకుల్లో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్‌ సి, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది కాల్షియం, ప్రోటీన్‌, ఐరన్‌, అమైనో యాసిడ్‌లను కూడా కలిగి ఉంది. ఇవి మీ శరీరాన్ని నయం చేయడానికి, కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లతో నిండి ఉంటుంది. కణాలను దెబ్బతినకుండా రక్షించగల రోగనిరోధక వ్యవస్థను పెంచే పదార్థాలు ఇందులో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్‌లలో కొన్ని రక్తపోటును తగ్గించగలవని, రక్తం, శరీరంలో కొవ్వును తగ్గించగలవని కొన్ని ఆధారాలు ఉన్నాయి.

మునగాకు ద్రవం వాపు, ఎరుపు, నొప్పిని తగ్గిస్తుంది. మునగాకులో కనిపించే ఇన్సులిన్‌ లాంటి ప్రోటీన్లు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయ పడతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఆకుల్లో కనిపించే రసాయనాలు శరీరం చక్కెరను మెరుగ్గా ప్రాసెస్‌ చేయడంలో సహాయపడతాయి. ల్యాబ్‌ పరీక్షల్లో, ఆకు పదార్దాలు ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలను మందగించేలా చేస్తాయి. కీమోథెరపీ మెరుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. కొంతమంది నిపుణులు మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ఆరోగ్యాన్ని ప్రోత్సహించే రసాయనాలు మెదడులో ఒత్తిడిని, మంటను నయం చేస్తాయని భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement