Monday, May 27, 2024

Breaking: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్రాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సర్క్యూలర్‌ జారీ చేసింది. గతంలో ప్రతి ఏటా ఒక్కో ఎంపీకి 10 సీట్లు కేటాయించేవారు. ప్రవేశాల కోసం ఎంపీల కోటాను పెంచాలని ఇటీవలే డిమాండ్ వచ్చిందని, దీంతో కేంద్ర ప్రభుత్వం మొత్తం కోటానే రద్దు చేసింది. లోక్‌సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 245 మంది కలిసి ఏటా మొత్తం 7,880 మంది విద్యార్ధులకు కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. ఎంపీల కోటాలో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి. దీంతో మొత్తం కోటానే రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement