Wednesday, May 15, 2024

మోడ‌ల్ కాదు బిచ్చ‌గాడు-అత‌డిని చూస్తే షాకే

అత‌నో బిచ్చ‌గాడు..కానీ చూడ‌టానికి మోడ‌ల్ ని త‌ల‌ద‌న్నేలా ఉన్నాడు. నలుపు రంగు టీషర్ట్, కళ్లకు నల్ల కళ్లజోడు పెట్టుకుని.. మంచి హెయిర్ స్టైల్ తో కనిపించాడు. చూడగానే ఎవరో మోడలో, సినిమా స్టారో అన్నట్టుగా కనిపించాడు. కానీ కిందికి చూస్తే.. కాలు దెబ్బతిని, చేతి కర్రలతో నడుస్తున్నాడు. నిజానికి అతనొక భిక్షగాడు. ఇది గమనించగానే జాలి వేసినా.. అతడి రూపం, స్టైల్ చూసి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్ లో కవాల్ జిత్ సింగ్ బేడీ అనే నెటిజన్ ఈ ఫొటోను ‘ఢిల్లీ బెగ్గర్స్’ క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఫొటో వైరల్ గా మారింది. 20 వేలకుపైగా లైక్ లు, వేల కొద్దీ రీట్వీట్లు వచ్చాయి.

ఇవన్నీ చూసిన సదరు నెటిజన్.. తన కారులో ఉన్న డ్యాష్ క్యామ్ (సీసీ కెమెరా వంటిది) ఫుటేజీలోని వీడియోను షేర్ చేశారు. అతను నిజంగానే భిక్షగాడు అని.. అతడి ఒక కాలు విరిగి, కర్రలతో నడుస్తున్నాడని తెలిపారు.ఈ బిచ్చ‌గాడు బాలీవుడ్ నటుడు ఆదిత్యరాయ్ కపూర్ లా ఉన్నాడని, హృతిక్ రోషన్ తమ్ముడిలా ఉన్నాడని కొందరు అంటుంటే.. పుష్ప హీరో అల్లు అర్జున్ లా ఉన్నాడంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. అతనెవరోగానీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా తెరిచి ఫొటోలు పెట్టి ఉంటే బాగా ఫాలోయింగ్ వచ్చి ఉండేది అని చెబుతున్నారు నెటిజన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement