Saturday, May 4, 2024

తాప్సీ చిత్రానికి – కొత్త‌గా ప్ర‌మోష‌న్స్

హీరోయిన్ తాప్సీ న‌టిస్తోన్న చిత్రం మిష‌న్ ఇంపాజిబుల్..కాగా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని వినూత్నంగా చేప‌ట్టారు చిత్ర యూనిట్. ఈ మేర‌కు ఓ వీడియోను రిలీజ్ చేసింది స్వ‌రూప్ టీం. సినిమాలో కీ రోల్స్ చేస్తున్న హ‌ర్ష చెముడు, హ‌ర్ష్ రోష‌న్, భాను ప్ర‌క్ష‌న్‌, జ‌య‌తీర్థ మొలుగు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ ముగ్గురు సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం హ‌ర్ష ద‌గ్గ‌రకు వెళ్తే ఓ స‌ల‌హా ఇస్తాడు. ఆ త‌ర్వాత ముగ్గురూ క‌లిసి డైరెక్ట‌ర్లు త‌రుణ్ భాస్క‌ర్‌, భ‌ర‌త్ క‌మ్మ‌, వివేక్ ఆత్రేయ‌, సందీప్ రాజ్‌, వినోద్ అనంతోజు, వెంక‌టేశ్ ల‌ను క‌లిసి ప్ర‌మోట్ చేయాల‌ని కోర‌తారు. అయితే సినిమా టైటిల్‌లో స్పెల్లింగ్ త‌ప్పుంద‌ని డైరెక్ట‌ర్లు ప్రమోట్ చేయ‌లేమ‌ని చెప్తారు. ఇక ఫైన‌ల్‌గా చేసేదేమిలేక ముగ్గురు క‌లిసి మ‌ళ్లీ హ‌ర్ష ద‌గ్గ‌ర‌కొస్తారు. అందరూ అవ‌మానించార‌న్నా వాళ్లు చెప్ప‌గానే..అన్న చెప్పిన‌ట్టుగానే ఆ ఎమోష‌న్ మ‌న ప్ర‌మోష‌న్‌కు వాడి ట్రైల‌ర్‌ను రిలీజ్ చేద్దామ‌నుకుంటారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. మొత్తానికి ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్‌జే ట్రైల‌ర్ లాంఛింగ్‌కు ముందే త‌న సినిమాను కొత్త‌గా ప‌బ్లిసిటీ చేస్తూ ఎంతోమంది కొత్త ద‌ర్శ‌కుల్లో జోష్ నింపుతున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement