Wednesday, May 15, 2024

రాజ్యసభ సీట్ల విషయంలోచర్చలు.. ఎల్​డీఎఫ్​ కూటమిలో పోటాపోటీ!

కేరళ రాష్ట్రంలో రాజ్యసభ సీట్ల భర్తీపై గందరగోళం నెలకొంది. ఆ రాష్ట్రంలోని ఎల్​డీఎఫ్​ కూటమిలోని నాలుగు పార్టీల మధ్య రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో అయోమయం తలెత్తుతోంది. అక్కడ ఖాళీ అవుతున్న మూడు సీట్లలో రెండింటిపై సీపీఎం కన్నేసింది. దీంతో మిగతా పార్టీలు ఒక సీటును షేర్​ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీనిపై అన్ని మిత్ర పక్షాలతో చర్చలు జరపాలని సీపీఎం, సీపీఐ నేతలు భావిస్తున్నారు. కాగా, ఖాళీ అయిన స్థానాలను రెండు పార్టీలు పంచుకోవాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మార్చి 15లోగా రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేయాలని సీపీఐ భావిస్తోంది. పార్లమెంట్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు మార్చి 31న జరగనున్నాయి. ప్రస్తుత ఆధిక్యంతో ఎల్‌డిఎఫ్ రెండు స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకోగలదు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎకె ఆంటోనీ ఖాళీ చేసిన ఒక స్థానాన్ని ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఉంచుతుంది. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఇక.. సీపీఎం రాజ్యసభ స్థానానికి ఒక అభ్యర్థిని నామినేట్ చేస్తుంది. రెండవ స్థానాన్ని ఎల్‌డిఎఫ్‌లోని మిత్రపక్షాలలో ఒకదానికి ఇవ్వున్నారు. వీపీ సాను, ఏఏ రహీమ్‌ వంటి యువ నేతలను కూడా రాజ్యసభకు పంపే విషయమై పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎల్‌డిఎఫ్‌లో సీపీఐ రెండో అతి పెద్ద భాగస్వామ్య పార్టీ కావడంతో ఈ సీటు తమకే దక్కుతుందని అంతా భావిస్తున్నారు. సీపీఐ, సీపీఎం సఖ్యతలేని కారణంగా ఈ ఎన్నికలు ఎట్లా జరుగుతాయోనన్న విషయంలో పరిశీలకులు అయోమయం వ్యక్తం చేస్తున్నారు.  కాగా, ఈ మధ్య ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సీపీఐ బహిరంగంగా ప్రశ్నించింది. కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించింది కూడా. నాలుగు ఎల్‌డిఎఫ్‌ పార్టీలు ఈ సీటుపై కన్నేసినట్టు సీపీఎ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement