Saturday, May 4, 2024

మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం.. జెండర్ ఈక్వాలిటీ 2k, 5k రన్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పేర్కొన్నారు. షిటీమ్ పోలీస్ ను ఏర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రతను కల్పించడం జరిగిందని మహిళల భద్రత, లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించేందుకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన షీ-టీమ్స్ రన్ ను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ పాల్గోని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా షీ-టీమ్ లు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో లాగా మహిళలపై ఆకతాయిలు, పోకిరీల అగాయిత్యలు, చోరీలు తగ్గిపోయాయని, నేరగాళ్లకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఅర్ గారి తీసుకున్న కఠినమైన నిర్ణయాల వల్లే పేర్కొన్నారు.

సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం’ అనే థీమ్‌కు అనుగుణంగా, ఖమ్మం పోలీస్ శాఖ షీ-టీమ్‌ ఆధ్వర్యంలో జెండ‌ర్ ఈక్వాలిటీ 2కే, 5కే ర‌న్‌ను నిర్వ‌హించ‌డం అభినందనీయమన్నారు. ఖమ్మంకు పోలీస్ కమిషనరేట్ తీసుకురావాలని నాడు అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్ళి సాదించుకున్నామన్నారు. సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పెంచటం వల్లే నేరాలను అదుపులో ఉంచగలిగామన్నారు. అందుకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మ‌హిళ‌ల‌కు నిరంత‌రం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం మహిళల భద్రత మరియు లింగ సమానత్వం గూర్చిన ప్రచారాన్ని ఈ రన్ ద్వారా నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. అనంతరం రన్ పూర్తి చేసిన వారిని ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement