Saturday, May 18, 2024

Gold News: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధర

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి స్వల్ప ఊరట. నిన్నటి వరకు పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధరలకు నేడు బ్రేక్ పడింది. ఇవాళ్టి ధరలలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200గా కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590గా నమోదైంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగితే.. వెండి ధరలు మాత్రం తగ్గింది. దాదాపు రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.73,400కు చేరింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement