Monday, April 29, 2024

హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదు.. 111 జీవోపై కేటీఆర్ కీలక వ్యాఖ్య

క్రెడాయి ప్రాపర్టీ షోలో మంత్రి కే టీ ఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 111 జిఓ ఎత్తేస్తామని 2014లోనే కెసిఆర్ హామీ ఇచ్చారని, అప్పట్లో అన్ని పార్టీలు వాళ్ళు చెప్పారని అన్నారు. ఇపుడు జిఓ ఎత్తేస్తామని చెప్తే మాకు భూములు వున్నాయి అని అంటారని విమర్శించారు. అక్కడ ఉన్న జలాశయలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. జంట జలాశయల అవసరం అంతగా లేదన్నారు. గోదావరి,కృష్ణ, కాళేశ్వరం ప్రాజెక్టుల నుండి పుష్కలంగా నీళ్లు వస్తున్నాయని చెప్పారు. త్వరలో మాస్టర్ ప్లాన్ చేస్తామన్న కేసీఆర్… తాను ఎక్కడ ఫొటో దిగిన ఆ కంపెనీ నాదే అంటారని పేర్కొన్నారు. 84 గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, కొన్ని మీడియాలో కూడా 111జి ఓ కు వ్యతిరేకంగా వార్తలు రావడం బాధాకరం అని పేర్కొన్నారు. రాబోయే 10ఏళ్ల వరకు హైదరాబాద్ అభివృద్ధికు డోకా లేదని స్పష్టం చేశారు. హలాల్, హిజబ్ లేదు ఇక్కడ మత కల్లోలం లేదన్నారు. కెసిఆర్ ను తిట్టడంలో ప్రతిపక్షం పీజీ చేసిందని ఎద్దేవా చేశారు. పనికిమాలిన విమర్శలు చేయడంలో వాళ్లకు మించినోళ్లు లేరన్నారు. పొద్దున్న లేవగానే కెసిఆర్ ను తిడతారని, అది తప్ప వాళ్లకు ఎం తెలియదని కేటీఆర్ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement