Thursday, March 28, 2024

జూలై 15న రిలీజ్ కానున్న- శ‌భాష్ మిథు చిత్రం

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌ముఖ‌ క్రికెట‌ర్ల‌ నిజ‌జీవిత క‌థ‌లు సినిమాలుగా తెర‌కెక్కి బాక్సాఫీస్ ద‌గ్గ‌రే కాకుండా.. విమ‌ర్శ‌కుల నుంచి కూడా గొప్ప ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి. అందులో’M.S ధోని:ది అన్‌టోల్డ్ స్టోరి’,’ 83′ చిత్రాలు ముందు వరుస‌లో ఉంటాయి. ఈ క్రమంలోనే తాప్సీ ‘శ‌భాష్ మిథూ’ అనే స్పోర్ట్స్ డ్రామా సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. భార‌త మహిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్‌ ‘మిథాలీ రాజ్’ జీవిత క‌థ ఆధారంగా ‘శ‌భాష్ మిథు’ చిత్రం తెర‌కెక్కింది. శ్రీజిత్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రంలో తాప్సీ మిథాలీరాజ్ పాత్ర‌లో న‌టించ‌నుంది. ఇదివ‌ర‌కే చిత్ర బృందం విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు, టీజ‌ర్ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో అంచ‌నాలు పెంచాయి. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్నిజూలై 15న పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ఒక రోజు ముందే రామ్ పోతినేని హీరోగా న‌టిస్తున్న ‘ది వారియ‌ర్’ చిత్రం విడుద‌ల కానుంది. ఎన్.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీగా అంచాన‌లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement