Monday, April 29, 2024

కైటెక్స్‌ అపెరల్‌ పార్కుకు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్‌ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు  చేయనున్న ఈ సంస్థలో 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం మిషన్‌ భగీరథ ట్యాంక్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement