Monday, May 6, 2024

అథ్లెటిక్స్ లో – రికార్డు బ్రేక్ చేసిన అవినాశ్ సాబ్లే

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సాన్ జువాన్ కాపిస్ట్రానో ప‌ట్ట‌ణంలో అథ్లెటిక్స్ పోటీలు జ‌రుగుతున్నాయి. ఈ పోటీల్లో కొత్త రికార్డు నెల‌కొల్పాడు స్ప్రింట‌ర్‌ అవినాశ్ సాబ్లే ..30 ఏళ్ల క్రితం నాటి జాతీయ రికార్డును బ్రేక్ చేశాడు. 5000 మీట‌ర్ల ర‌న్నింగ్ ఈవెంట్‌ను అత‌ను కేవ‌లం 13:25.65 నిమిషాల్లో పూర్తి చేశాడు. అయితే ఈ టైమింగ్‌లో ఈవెంట్‌ను పూర్తి చేయ‌డం అది స‌రికొత్త జాతీయ రికార్డుగా మారింది. గ‌తంలో ఈ రికార్డు బ‌హదూర్ ప్ర‌సాద్ పేరిట ఉంది. మ‌హారాష్ట్ర‌కు చెందిన అవినాశ్ అమెరికా ఈవెంట్‌లో.. 1992లో బ‌హ‌దూర్ ప్ర‌సాద్ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు. 5వేల మీట‌ర్ల రేస్‌ను బ‌హ‌దూర్ 13:29.70 నిమిషాల్లో పూర్తి చేశాడు. సాన్ జువాన్ రేస్‌లో అవినాశ్ 12వ స్థానంలో నిలిచినా.. అత‌ను మాత్రం కొత్త జాతీయ రికార్డును నెల‌కొల్ప‌డం విశేషం. ఇటీవ‌ల కోజికోడ్‌లో జ‌రిగిన రేస్‌లోనూ అవినాశ్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్‌లోను అత‌ను 5వేల మీట‌ర్ల రేస్‌ను 13.39.43 నిమిషాల్లో పూర్తి చేశాడు. హాఫ్ మార‌థాన్‌తో పాటు 3000 మీట‌ర్ల స్టీపుల్‌ఛేజ్‌లోనూ అవినాశ్ పేరిట జాతీయ రికార్డులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement