Tuesday, April 30, 2024

21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు : ఒమిక్రాన్ క‌ట్ట‌డికి ప్ర‌జ‌ల స‌హ‌కారం అవ‌స‌రం : మంత్రి హ‌రీశ్ రావు

ఒమిక్రాన్ కేసుల‌పై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు. ముప్పు జాబితాలోని దేశాల నుంచి వ‌చ్చిన వారిలో ఈ కేసులు రాలేద‌న్నారు. వేరే దేశాల నుంచి వ‌చ్చిన వారికి పాజిటీవ్ గా తేలింద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. పాజిటివ్ వచ్చిన తలీబ్ ఇక్రాన్ అనే మహిళను వెంటనే టిమ్స్ ఆసుపత్రికి తరలించారని వెల్ల‌డించారు. 23 ఏళ్ల అబ్దుల్లా అహ్మద్ అనే యువకుడి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో ఉన్నామని, ఇటు వైద్యశాఖ అధికారులు, అటు పోలీసులు అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నారని మంత్రి తెలిపారు. ఇప్పటి వ‌ర‌కు నమోదైన కేసులను చూస్తే వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందన్నారు. అయితే, వ్యాధి వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉందని వివరించారు. బ్రిటన్ లో రెండు మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపవుతున్నాయని చెప్పారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధమైందని హరీశ్ వివరించారు. అందరూ దయచేసి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీకా వేయించుకోవడం, మాస్కు పెట్టుకోవడం వంటి వాటితోనే ఒమిక్రాన్ వ్యాప్తిని నియంత్రించగలుగుతామని సూచించారు. జనసమ్మర్థ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్లొద్దని, ఎక్కడా గుమికూడవద్దని స్పష్టం చేశారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ .. 95 శాతం పూర్తయిందని, 18 ఏళ్లు దాటిన 3 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి దాకా కోటీ 50 లక్షల 93 వేల 960 మందికి టీకాలు ఇచ్చామన్నారు. మొత్తం జనాభాలో 54 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. మిగతా వాళ్లూ టీకా వేయించుకోవాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి దానిపైన ప్రచారం కూడా చేస్తున్నామన్నారు. ముందుజాగ్రత్తగా 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధం చేసి పెట్టుకున్నామని, ఆక్సిజన్ కొరత రాకుండా చూస్తున్నామని హరీశ్ తెలిపారు. బెడ్లనూ సిద్ధం చేశామన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఒమిక్రాన్ కట్టడికి ప్రజల నుంచి కూడా సహకారం అవసరమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement