Sunday, April 28, 2024

CRDA చట్టం ప్రకారం ముందుకు: ఏపీ రాజధానిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్య

టీడీపీపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. మనుసులు పెరగడం కాదు, బుద్ది కూడా పెరగాలన్నారు. చంద్రబాబు ఫామిలీ మొత్తం హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో అడ్రస్ లేకుండా ఐదేళ్లు  ముఖ్యమంత్రిగా పాలించడం దురదృష్టం అని ఎద్దేవా చేశారు. విభజన జరుగుతున్న నేపథ్యంలో చట్టాన్ని పార్లమెంట్ లో పెట్టారన్న బొత్స.. 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉపయోగించుకోమన్నారని తెలిపారు. అందులో భాగంగా రాజధానా  ఎక్కడ కావాలో పొందుపారుచుకోండి అని చట్టంలో పొందుపరిచారని అన్నారు. వాటికి అనుగుణంగా శివరామ కృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమరావతి రాజధానిలో గోలుమాల జరిగిందని, కోట్లు దోచుకుతున్నారని బొత్స ఆరోపించారు. ఆలోచన లేకుండా పని చేస్తున్నారని, ఇలాంటి పనులు చేసి 20 ఏళ్ళు వెనక్కి తీసికుపోయారని మండిపడ్డారు. CRDA చట్టం ప్రకారం ముందుకు వెళతామన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించుకున్నాం, వాటికి అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. తాను ఎవరిని విమర్శలు చేయలేదని ఆలోచన చేసి మాట్లాడాలని హితవు పలికారు. హైదరాబాద్ లో చంద్రబాబు ఎందుకు ఉన్నారని, ఎందుకు అమరావతి రాలేకపోయారని మంత్రి బొత్స ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement