Monday, May 6, 2024

సీఎం జ‌గ‌న్, మంత్రి పేర్ని నానికి ప్రభాస్ కృతజ్ఞతలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్‌ ధర కనీసం రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.250గా నిర్ణయించింది. ఏసీ, నాన్‌ ఏసీ, థియేటర్లు ఉన్న ప్రాంతాలు, వాటిలో కల్పించే సదుపాయాల ఆధారంగా టికెట్ల ధరలను నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఈసంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పేర్ని నానిలకు ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందులను, పరిశ్రమ వర్గాల కష్టాలను అర్థం చేసుకొని మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. మరోవైపు తెలుగు ఫిల్మ్ చాంబర్ కూడా టికెట్ ధరలపై స్పందిస్తూ ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాధేశ్యామ్ విడుదలకు ముందు టికెట్ల ధరలు పెంచితే సంతోషిస్తానని ప్రభాస్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కోరుకున్నట్లే రాధేశ్యామ్ విడుదల వేళ ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంది. దీంతో రాధేశ్యామ్‌కు కలిసొచ్చినట్లయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement