Sunday, April 28, 2024

ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌కు మీట‌ర్లు ఎన్ని పెట్టారు – లెక్క‌లు చెప్పండి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ సరఫరా చేసే పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌) వద్ద మీటర్ల ఏర్పాటు ఇంకా మొదలు కాలేదు. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) 2022 మార్చి నెలాఖరులోగా మీటర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాలని ఆదేశించినా విద్యుత్‌ పంపిణి (డిస్కంలు) సంస్థలలో ఎలాంటి స్పందన లేదు. ఈ ఏడాది మార్చి ముగిసినా ఇంత వరకు కనీసం మీటర్ల కొనుగోలు కూడా ప్రారంభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మ ర్లకు ఇప్పటికిప్పుడు మీటర్లు పెట్టాలంటే రూ.98 కోట్లు అవసరమని, అన్ని నిధులు లేనందున ఆర్‌ఈసీని రుణం అడిగినట్లు ఈఆర్‌సీకి డిస్కంలు తెలిపాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని డీటీఆర్‌లకు మీటర్లు పెట్టా రనే వివరాలు ఇవ్వాలని తాజాగా డిస్కంలకు ఈఆర్‌సీ లేఖ రాసింది.

రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలో (2014-15 వరకు) 18 లక్షల వరకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అప్పుడు 11,671.24 మిలియన్‌ యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగం అయ్యేది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య 27 లక్షలకు దాటింది. దీంతో విద్యుత్‌ వినియోగం కూడా 20వేల మిలియన్‌ యూనిట్లకు దాటిపోయింది. అందులో వ్యవసాయానికి ఎక్కువగా విద్యుత్‌ ఖర్చు అవుతోందని డిస్కంలు చెబుతున్నాయి. వ్యవయసాయ బోరు మోటార్లు లేదా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు లేకుండా విద్యుత్‌ విని యోగం ఎంత మేరకు ఖర్చు అవుతుందో కచ్చితమైన లెక్క ఎలా తెలుస్తో ందని డిస్కంలను ఈఆర్‌సీ ప్రశ్నిస్తోంది. విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ పెరగడం వల్ల డిస్కంలు గత ఏడాది డిసెంబర్‌ నుంచి మార్చి వరకు రూ.4 వేల కోట్లు వెచ్చించి ‘భారత ఇంధన ఎక్సేంజీ’లో అదనపు కరెంటును కొనుగోలు చేశాయి. కొనుగోలు చేసిన కరెంట్‌లో ఎక్కువగా వ్యవసాయ బోర్లకే వినియోగం అయినట్లు డిస్కంలు వెల్లడిస్తున్నాయి. అయితే వ్యవసానికి ఎంత కరెంటు వాడుతున్నారనే లెక్కలను తేల్చడానికి డీటీఆర్‌ల వద్ద మీటర్లు పెట్టాలని ఈఆర్‌సీ చెబుతోంది. అధికారికంగా వ్యవసాయ బోర్లు 27లక్షలకు పైగా ఉన్నప్పటికి.. అనధికారికంగా మరో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు విద్యుత్‌ ఉన్నాయని డిస్కంలు చెబుతు న్నాయి. కాల్వల ద్వారా వచ్చే నీళ్లను వాడుకునేందుకు రైతులు అనధికా రికంగా బోరు మోటార్లను వాడుతున్నారని, మధ్యలో కరెంటు వైర్లు తగి లించడం వల్ల రైతులను ఏవి చేయలేకపోతున్నామని డిస్కంలు చెబు తున్నాయి. ప్రభుత్వం కూడా రైతులకు ఉచితంగా కరెంట్‌ సరఫరా చేసు ్తన్నందున రైతులు కూడా విద్యుత్‌ కనెకక్షన్లు తీసుకోవడం లేదని చెబుతున్నారు.

వచ్చే నెల నుంచి తనిఖీలు చేస్తాం : ఈఆర్‌సీ చైర్మన్‌ శ్రీరంగారావు
వ్యవసాయానికి సరఫరా అయ్యే ప్రతి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు మీటర్‌ ఏర్పాటు పనులను పరిశీలించడానికి వచ్చే నెల నుంచి క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తామని విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ శ్రీరంగారావు తెలిపారు. డీటీఆర్‌లకు మీటర్లు పెట్టకపోతే నిబంధనల ప్రకారం డిస్కంలకు జరిమానాను వేస్తామని తెలిపారు. వ్యవసా యానికి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తోందని, అందుకోసం ప్రభుత్వం ఏటా ప్రజాధనాన్ని రాయితీగా రూ.10 వేల కోట్లకు పైగా చెల్లిస్తోందని తెలిపారు. ఈ సొమ్మను నిజంగా రైతులకు చేరి సద్వినియోగం అవుతుందా..? లేదా అనేది తేలాలంటే ప్రతి డీటీఆర్‌ వద్ద డిస్కంలు మీటర్లు పెట్టాల్సిందేనని శ్రీరంగారావు పేర్కొన్నారు. రైతులకు సంబంధించి బోరు మోటార్లకు ఎన్ని యూనిట్లు విద్యుత్‌ ఖర్చు చేశారనే లెక్కలు డిస్కంలు చెప్పాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement