Friday, April 26, 2024

టెన్త్ పేపర్ లీక్ కేసు… విచారణకు హాజరైన ఈటెల రాజేందర్

పదవ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ డీసీపీ ఎదుట ఈటల రాజేందర్ హాజరయ్యారు. టెన్త్ హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఈటల రాజేందర్‌ను వరంగల్ పోలీసులు విచారిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని కమలాపూర్‌లో 10వ తరగతి హిందీ పేపర్ లీక్ అయింది. పరీక్ష ప్రారంభమైన గంటసేపటికే ప్రశాంత్ అనే వ్యక్తి ఈటల రాజేందర్‌కు వాట్సప్‌లో పేపర్ పంపించాడు. ఈ పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు దూకుడు పెంచి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పేపర్ వాట్సప్ ద్వారా పరీక్ష ప్రారంభమైన గంటసేపటికే వెళ్లినట్లుగా గుర్తించారు. దీంతో ఈటల రాజేందర్‌కు కొద్దిరోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. టెన్త్ పేపర్ లీకేజీలో భాగంగా ఈటల రాజేందర్ ఇవాళ వరంగల్ సెంట్రల్ డీసీపీ ఎదుట హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ డీసీపీతో పాటు ఏసీపీ, కమలాపూర్ ఇన్స్పెక్టర్లు కలిసి ఈటల రాజేందర్‌ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈటల రాజేందర్ పీఏలను పోలీసులు విచారించి వారి సెల్‌ఫోన్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement