Saturday, May 4, 2024

చూస్తుండ‌గానే క‌రిగిపోయిన కొండ – టిడిపి యువ నేత వీడియో పోస్ట్

చూస్తుండ‌గానే కొండ స‌గం మేర క‌రిగిపోయింద‌ని టిడిపి యువ‌నేత ..పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బండారు అప్ప‌ల‌నాయుడు త‌న సోష‌ల్ మీడియాలో ఖాతాల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. 26 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియోలో అంతెత్తున ఉన్న ఓ కొండ అలా చూస్తుండ‌గానే స‌గం మేర క‌రిగిపోయింది. కొండపై ఉన్న బండ‌రాళ్లు అలా విరిగి జారిప‌డిపోవ‌డం ప్రారంభించ‌గానే… క్ష‌ణాల్లో కొండ‌లో దాదాపుగా స‌గం మేర క‌రిగిపోయింది. ఈ దృశ్యాల‌ను కొంద‌రు యువ‌కులు త‌మ సెల్ ఫోన్ల‌లో రికార్డు చేయ‌గా… ఆ వీడియోను అప్ప‌ల‌నాయుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు .ఈ కొండ ఎక్క‌డిద‌న్న దానిపై స్ప‌ష్ట‌త లేకున్నా… విశాఖ‌ జిల్లా ప‌రిధిలోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వైఎస్సార్సీపీ నాయకుల ధన దాహానికి కొండలు సైతం పిండి అవుతున్నాయంటూ అప్ప‌ల‌నాయుడు ఈ వీడియోకు ఓ కామెంట్ యాడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement