Friday, May 3, 2024

ఈసీఐ బీజేపీకి ఓ బ్రాంచ్​గా మారింది.. స్వతంత్రంగా పనిచేయడం లేదు: మాజీ సీఎం ముఫ్తీ

కాశ్మీరీ పండిట్ల పోరాటాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓట్ల కోసం వాడుకుంటోందని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. అయినా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈసీ ఇప్పుడు బీజేపీకి ఓ శాఖగా మారిందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇవ్వాల (శనివారం) ఆరోపించారు.

భారత ఎన్నికల సంఘం ఇప్పుడు బీజేపీకి ఓ శాఖగా మారిందని, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ మత ప్రాతిపదికన ప్రచారం చేసినప్పుడు ఈసీఐ మౌనంగా ఉందని మండిపడ్డారు. ECI మునుపటిలాగా స్వతంత్రంగా లేదని, బీజేపీ కనుసన్నల్లోనే ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోందని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు.  

ప్రస్తుత ప్రభుత్వం ప్రతిదానికీ అంతరాయం కలిగించడానికే ఇక్కడ ఉందని ముఫ్తీ అన్నారు. కాశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడే వరకు జమ్మూకు తరలించాలని కాశ్మీరీ పండిట్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని, అయితే ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా .. వారి ఆదాయాలను, రేషన్‌లను నిలిపివేస్తోందని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement