Saturday, May 4, 2024

Mega Star: తెలంగాణలో టికెట్ ధర పెంపు.. సీఎం కేసీఆర్‌కు చిరంజీవి కృతజ్ఞతలు

తెలంగాణ‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీ దారులకు, థియేటర్ల‌ యాజమాన్యానికి, అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞ‌తలు. సినిమా థియేటర్ల  మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’ అని చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు పరిశ్రమ బాగుకోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ లకు కూడా మెగాస్టార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement