Tuesday, April 30, 2024

కార్మిక, కర్షకులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన‌ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మే డేను పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం, ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటూ విజయవంతంగా అమలవుతున్నదని పేర్కొన్నారు.

వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టి జరుగుతున్నదని, అది దేశాభివృద్ధికి దోహద పడుతున్నదని ఆయన అన్నారు. నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement