Friday, May 3, 2024

థోర్ చిత్రం నుండి ట్రైల‌ర్ రిలీజ్

సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్ పై వ‌స్తున్న నాలుగో చిత్రం థోర్. మార్వెల్ నుంచి రానున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులను పటాపంచలు చేస్తూ క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ నటించిన ‘థోర్‌: లవ్ అండ్‌ థండర్‌’ సినిమా అప్‌డేట్‌ను ఇచ్చారు..మార్వెల్ సూప‌ర్ హీరోల్లో ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ఉన్న క్యారెక్ట‌ర్ థోర్‌. ఈ సూప‌ర్ హీరో సిరీస్‌కు సంబంధించి ఇప్ప‌టికే మూడు సినిమాలు వ‌చ్చాయి. జూలై 8, 2022న థోర్ ల‌వ్ అండ్ థండ‌ర్ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. ఇది థోర్ సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్‌పై వ‌స్తున్న నాలుగో సినిమా. మార్వెల్‌ నుంచి రాబోతున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ ఎదురుచూపులను పటాపంచలు చేస్తూ క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ నటించిన ‘థోర్‌: లవ్ అండ్‌ థండర్‌’ సినిమా అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తూ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. థోర్‌ సిరీస్‌లో నాలుగో చిత్రంగా ఈ మూవీ రానుంది. ట్రైలర్‌ విడుదల చేసి మూవీ ప్రియులకు మరింత ఆసక్తిని పెంచారు. ఈ చిత్రానికి అంతకుముందు వచ్చిన ‘థోర్‌: రాగ‍్నరోక్‌’ డైరెక్టర్‌, ఆస్కార్‌ విజేత తైకా వైటిటి దర్శకత్వ వహించారు. ఈ మూవీ కథ ‘ది అవేంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ తర్వాత నుంచి కొనసాగడం ట్రైలర్ లో చూపించారు. ఈ మూవీ ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. థోర్‌ (క్రిస్‌ హేమ్స్‌వర్త్‌) గార్డియన్స్‌ అయిన పీటర్‌ క్విల్‌ (క్రిస్‌ ప్రాట్‌), అతని టీమ్ తో నివసిస్తుంటాడు. గాడ్‌ ఆఫ్‌ థండర్‌ కవచాన్ని వదిలేసి మళ్లీ ఎప్పటిలా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. తర్వాత థోర్ ఎప్పుడూ ఎదుర్కోలేని సంఘటనలు ఫేస్‌ చేసినట్లు చూపించారు. అలాగే ఇందులో థోర్‌ మాజీ ప్రేయసీ జేన్‌ ఫోస్టర్‌ (నటాలీ పోర్ట్‌మన్‌) లేడీ థోర్‌గా అలరించనుంది. ఇందులో ‘ది డార్క్‌ నైట్‌’ హీరో క్రిస్టియన్‌ బాలే కూడా ఉండటం విశేషం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement