Monday, April 29, 2024

వివాదంలో మ్యాంగో యూట్యూబ్ ఛాన‌ల్ – రామ్ పై మండిప‌డుతోన్న మ‌హిళ‌లు

మ్యాంగో యూట్యూబ్ ఛాన‌ల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తోంది. కాగా ఈ వీడియోల‌లో గౌడ మ‌హిళ‌ల‌ల‌ను వేశ్య‌లుగా చిత్రీక‌రించార‌ని ఛాన‌ల్ అధినేత రామ్ పై గౌడ కుల సంఘాలు మండిప‌డ్డాయి. అంతేకాదు ఆ యూట్యూబ్ ఛానల్ పై నేడు దాడికి కూడా యత్నించినట్టు సమాచారం. తమ సామాజికవర్గ మహిళలను కించపరిచేలా తీసిన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై రామ్ స్పందించాల్సి ఉంది. కాగా రామ్ సింగ‌ర్ సునీత్ భ‌ర్త అనే సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement