Friday, May 3, 2024

మోడ‌ల్ గా మారిపోయిన రోజువారి కూలీ – వైర‌ల్ గా ఫొటోస్

ఆయ‌న ఓ రోజువారి కూలి. వ‌య‌సు 60ఏళ్లు. ఆయ‌న పేరు మ‌మ్మికా.. ఇత‌నిది కేర‌ళ‌. కాగా ఫొటోగ్రాఫ‌ర్ ష‌రీక్ వ‌య‌లిల్ రోడ్డుపై వెళ్తోన్న మ‌మ్మికాలో ఓ మోడ‌ల్ ని చూశాడు. ఇంకేముంది మ‌మ్మికాన్ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ మోడ‌ల్ గా మారిపోయాడు. తన కోసం ఓ ప్రమోషనల్ ఫొటోషూట్ చెయ్యమని కోరాడు. తానేంటి ఫొటోషూట్ ఏంటి అనుకున్న కూలీ… జోక్ చెయ్యకండి బాబూ అని వెళ్లిపోతుంటే… షరీక్ వెంటపడ్డాడు. తాను సీరియస్ గానే అంటున్నానని చెబుతూ ఒప్పించాడు. ఆ తర్వాత మమ్మికాని సెలూన్ కి తీసుకెళ్లి… గెటప్ మార్చేశారు. ఫారిన్ లుక్ వచ్చేలా చేశారు. సూటూ, బూటూ వేశారు. చేతిలో ఐపాడ్ పెట్టి స్టైల్ గా ఫోజ్ కొట్టించారు. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ shk_digitalలో పోస్ట్ చేశారు షరీక్. అంతే అవి వైరల్ అయ్యాయి. మమ్మికా కథ, ఆ ఫొటోగ్రాఫర్ కృషిపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మట్టి నుంచి మాణిక్యాన్ని వెలికి తీశారని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

మమ్మికా చూడటానికి నటుడు విజయకాన్ లా ఉన్నాడని నెటిజన్లు షరీక్ ని మెచ్చుకున్నారు. మమ్మికాకి మేకప్ ఆర్టిస్ మజ్నాస్ మేకప్ వేశారు. మజ్నాస్ కి ఆషిక్ ఫ్వాద్, షబీబ్ వయాలిల్… మేకప్ అసిస్టెంట్లుగా పనిచేశారు. మమ్మికాకి సంబంధించిన స్టిల్స్, వీడియో క్లిప్ లను షరీక్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు మమ్మికాకి కూడా సొంతంగా ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఉంది. అందులో ఆయన తన ఫొటోలు, స్టిల్స్ పోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మమ్మికాకి క్రేజ్ బాగుంది. మీడియాలో చాలా మంది కథనాలు ఇస్తున్నారు. కోజికోడ్… కొడివల్లీలోని తన సొంతూరు వెన్నక్కడ్ లో మమ్మికా ఇప్పుడు హీరో అయిపోయాడు. మమ్మికా ఇప్పుడు మోడల్ గా మారినా… తన రోజువారీ కూలీ పని చేసుకుంటూనే ఉంటానని తెలిపాడు. ఎవరైనా మోడలింగ్ ఆఫర్లు ఇస్తే వాటిని ఒప్పుకుంటానని చెబుతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement