Wednesday, May 15, 2024

లెక్కల టీచర్​ దారుణం.. విద్యార్థిని కొట్టడంతో కోమాలోకి..

చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. జ్వరంతో బాధపడుతున్న స్టూడెంట్​పై లెక్కల మాస్టారు ప్రతాపం చూపాడు. తలను డెస్క్ కు వేసి బాదడంతో కోమాలోకి వెళ్లిన ఘటన జరిగింది.. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

పలమనేరు మండలం జరావారిపల్లెకు చెందిన కామేశ్వరరెడ్డి కుమారుడు రోహిత్‌ కుప్పం రహదారి ప్రక్కన ఉన్న ఈమాస్విస్ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. వారం క్రితం పాఠశాలకు వెళ్లిన రోహిత్‌కు జ్వరం రావడంతో తరగతి గదిలో వెనుక వైపు ఉన్న డెస్కుపై పడుకున్నాడు. లెక్కల మాస్టర్‌ జ్యోతీశ్వర్ అది గమనించి దగ్గరకు పిలిచారు. రోహిత్‌ ఒంటిని తాకి జ్వరం లేదు తప్పు చెబుతావా అంటూ.. ఆ విద్యార్థి తలను వంచి టేబుల్‌పైకి కొట్టడంతో పాటు, వెనుకవైపు మళ్లీ తలపై కొట్టాడు.
దీంతో రోహిత్‌ ఇంటికి వెళ్లి పడకేశాడు. మంగళవారం మళ్లీ జ్యరం రావడంతో పాటు కాళ్లూ చేతులు పనిచేయకపోవడంతో పలమ నేరులోని ఓ క్లినిక్‌లో తల్లిదండ్రులు చూపించారు.

మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో రోహిత్‌ను స్విమ్స్‌లో చేర్పించారు. ఆదివారం వరకు కూడా రోహిత్‌ కోలుకోక పోవడంతో గ్రామస్థులు, రోహిత్‌ బంధువులు పాఠశాల వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్ధి వైద్య పరీక్షలకయ్యే వ్యయాన్ని భరిస్తామని, జ్యోతీశ్వర్‌ను సస్పెండ్‌ చేశామని చెప్పి సర్ది చెప్పారు. దీనిపై డిప్యూటీ ఎడ్యుకేషనల్​ ఆఫీసర్​ పురుషోత్తం మంగళవారం ఈమాస్విస్ పాఠశాలకు చేరుకొని పాఠశాల యాజమాన్యంతో విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement