Wednesday, May 22, 2024

వైర‌ల్ గా మ‌హేశ్ బాబు, రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీ ఫొటో

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వారి భార్య‌ల‌తో ఈ రెండు ఫ్యామిలీల ఫొటో వైర‌ల్ అవుతోంది. మహేశ్ బాబు – నమ్రత, రామ్ చరణ్ – ఉపాసన ఒకే ఫ్రేమ్ లో దిగిన ఫొటో ప్రస్తుతం ట్రెండవుతున్నదని చెప్పొచ్చు.ఈ ఫొటో చూసిన అభిమానులు మహేశ్- చరణ్ కాంబోలో సినిమా రావాలని కోరుతున్నారు. సూపర్ స్టార్ , మెగా పవర్ స్టార్ సూపర్ …అని కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ వచ్చే నెల 12న విడుదల కానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో మహేశ్ కు జోడీగా మహానటి కీర్తి సురేశ్ నటించింది.రామ్ చరణ్ తన తండ్రి చిరుతో కలిసి నటించిన ‘ఆచార్య’ ఫిల్మ్ ఈ నెల 29న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement