Thursday, May 2, 2024

Mahabubnagar Politial Scenario – సెంటిమెంట్ జిల్లా – పొలిటిక‌ల్ ఖిల్లా….పాల‌మూరులో ప‌ట్టు ఎవ‌రికి…?

ఉమ్మడి పాలమూరు జిల్లా నాడు నేడు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు సెంటిమెంట్‌ జిల్లాగా పొలిటికల్‌ ఖిల్లాగా పేరుగాంచింది. భారతదేశంలో పోలీస్‌ చర్య ముగిసిన తర్వాత 1952వ సంవత్సరంలో హైదరాబాద్‌ రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తదనంతరం తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసుకునేందుకు కొనసాగిన మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాడు పాలమూరు ఎంపీ స్థానం నుంచి గెలిచి నిలిచి యావత్‌ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.. మొత్తంగా చెప్పుకోదగ్గ గొప్ప విషయం పాలమూరు జిల్లా నుండి బరిలో దిగిన ఈ ప్రాంతం వారైనా ఏ ప్రాంతం వారైనా వారు గొప్ప స్థానానికి ఎదగడం ఖాయంగా చరిత్ర చెబుతోంది.. త్వరలోనే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 నియోజకవర్గాలు రెండు పార్లమెంటు- స్థానా ల్లోని అభ్యర్థులు వారి బలాబలాలను పెంచుకున్న ప్రయత్నంలో పడ్డారు. మూడు జాతీయ పార్టీలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా పార్టీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఉమ్మడి అభ్యర్థులు ఎన్నికల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు…

మహబూబ్‌నగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ఫలితాల చిట్టా చూస్తే నాడు అధికారంలో ఉన్న పార్టీదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో హవా. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పు డు కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి సంబం ధించిన మెజార్టీ స్థానాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీలు -కై-వసం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలలో గులాబీ జెండా ఎగురవేసింది. కొల్లాపూర్‌ స్థానం నుండి కాంగ్రెస్‌ బరిలో నిలిచి గెలిచిన నేత కూడా ప్రస్తుతం గులాబీ పార్టీలోనే ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి పాల మూరు జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంటు- ఎన్నికలు ఏవైనా గులాబీ గుబాలింపు మాత్రం ఖాయం అన్న చందంగా మారిం ది. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా లైన మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల రాజకీయ ఖిల్లాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థులకు రెబల్స్‌ బెడద ఎనభై శాతానికిపైగా కనబడుతోంది. ఆయా పార్టీలు గెలుపు గుర్రా లకే టికెట్లని ముందే సంకేతాలు ఇచ్చిన సందర్భంలో మాకేం తక్కువ.. తామూ బరిలో అంటూ అధికార బీఆర్‌ఎస్‌, భాజ పా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆశా వహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నాటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ నేపథ్యం ఎత్తుగడలు పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా కొనసాగేవి. ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పాటు- అయిన తర్వాత ఆయా జిల్లాలకు కొత్త పార్టీ సారధులు, బాధితులు వెరసి పార్టీలోని భావజాలం కాస్త క్షీణిస్తూ వస్తోంది. ఉమ్మ డి పాలమూరు గడ్డపై పాగా వేసేందుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయా పార్టీ ల అధినేతలు, కేంద్ర, రాష్ట్ర స్థాయి మం త్రులు ఇక్కడ జరిగే సభలు, సమావేశా ల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

పాలమూరు ఉమ్మడి జిల్లా అనగానే గుర్తుకొచ్చేది కరువు, ఆకలి కేకలు, వలసలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన వనరులైన టు-వంటి వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్య, ఉపాధి రంగాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ సక్సెస్‌ అయిందనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటు-న్నారు. వలసలు తగ్గి రైతన్నలకు సాగునీరు, నిరుద్యోగులకు ఉపాధి అవకా శాలు, పట్టణాలు, పల్లెలకు తాగునీరు, క్రింది స్థాయి వరకు పారదర్శక మైన సంక్షేమ పథకాల అమలు ఆ పార్టీకి మేలు చేసే అంశంగా చెప్పొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ తన సత్తా చాటేందుకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలలో అక్రమాలు, అవినీతిపై దృష్టి సారించడంతో పాటు-గా ప్రజలపక్షాన ధర్నాలు,రాస్తారోకోలు చేయడంలో ముందుం టో-ంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర స్థాయిలో రాహుల్‌ గాంధీ, రాష్ట్రస్థాయిలో పీసీసీ బాస్‌ పర్యటనలు సైతం పాల మూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగేలా చేసింది. హస్తవాసి ఈసారైనా బాగుండేలా తపన పడుతున్నారు నేతలు. మరోవైపు పాలమూరు జిల్లాలో కమాల్‌ చేసి కమలం వికసించేలా విశ్వ ప్రయత్నాలు చేస్తోం ది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాగా వేసేందుకు జిల్లాలోని ప్రముఖ నాయకులు బూత్‌ స్థాయి, క్షేత్రస్థాయిలో ఓటు- బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు, కార్యక్రమాలు చేపడుతున్నారు.

పాలమూరు నుండి మహామహులు వీరే..
భారత ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిలు పాలమూరు ఎంపీ స్థానం నుండి బరిలో నిలుస్తారని విశ్వసనీయ సమాచారం. ఇక్కడి సెంటిమెంట్‌ను ముగ్గురూ తమ ఖాతాల్లో వేసుకొని అటు- కేంద్రంలో, ఇటు- రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు- చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు- సమాచారం. వీరి పోటీ- ఖాయం అయితే… ఆయా పార్టీల నేతలకు గెలుపు సులువవుతుందని ఆయా పార్టీల అభ్యర్థులు, ఆశావహులు ఆశతో ఉన్నారు. పాలమూరు జిల్లా నాటి సెంటిమెంట్‌ చరిత్ర… నేటి ఉద్యమ నేత గెలుపు రాష్ట్ర ఏర్పాటు- చరిత్రను నమ్మకంతో పాలమూరు బరిలో ఈ ముగ్గురు నిలబడి గెలిచి నిలిచి తమ సత్తా చాటేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసే యజ్ఞంలో ఉన్నారని తెలిసింది.

బీఆర్‌ఎస్‌ నేతల బెర్తులు ఖాయం.. పలువురికి రెబెల్స్‌ బెడద
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ బరిలో నిలిచే బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఖాయమైనట్లు-గా తెలుస్తున్నది. 14 నియోజకవర్గాల్లో మహబూబ్‌నగర్‌ నుండి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్చర్ల నుంచి ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మారెడ్డి, గద్వాల బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, నారాయణపేట రాజేందర్‌ రెడ్డి, వనపరి ్తమంత్రి నిరంజన్‌ రెడ్డి, అచ్చంపేట గువ్వల బాలరాజు, షాద్‌నగర్‌ అంజయ్య యాదవ్‌.

- Advertisement -

బీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ స్థానాలు: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పోరు, గద్వాల్లో జడ్పీ చైర్మన్‌ సరితా తిరుపతయ్య గౌడ్‌ బెర్తుకోసం ప్రయత్నం చేస్తున్నారు. అలంపూర్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే అబ్రహంకు కల్లా వెంకటేశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్సీ అత్యంత సన్నిహితులైన కిషోర్‌ కర్ణ, సూరి, రాము దయాల్‌ శ్రవణ్‌ కుమార్తె బరి లో ఉన్నారని తెలుస్తోంది. దేవరకద్రలోనూ ఎమ్మెల్యే ఆలకు స్థానిక ఉన్నతాధికారి చెక్‌ పెట్టి తాను బరిలో నిలిచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జడ్చర్ల బరిలో టీటీడీ సభ్యుడు జీవన్‌ రెడ్డి తెరవెనక రహస్యా లపై ఉత్కంఠ ఉంది. కొల్లాపూర్‌ నుండి ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌ రెడ్డికిమామిళ్ళ విష్ణువర్దన్‌ రెడ్డి చెక్‌ పె-ట్టే యత్నంలో ఉన్నారు. అచ్చం పేటలో ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే పంచాయితీ సద్దుమణిగింది. కొడం గల్‌, షాద్‌నగర్‌లో స్థానిక ఎమ్మెల్యేలకు రెబెల్స్‌ బెడద లేదు.

గురి చూసి హస్తవాసి..
పాలమూరులో పాగా వేసేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ జోడోయాత్ర, భట్టి పీపుల్స్‌ పాదయాత్ర, పీసీసీ బాస్‌ రేవంత్‌ సభలను సద్వినియోగం చేసు కొని ఉమ్మడి జిల్లాల్లో హస్తం హవా చాటేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, ఆశావహులు కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై విరుచుకుపడుతూ జనాల్లోకి వెళ్తున్నారు. జడ్చర్ల బరిలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌, అనిరుద్‌ రెడ్డి బరిలో ఉన్నారు. గద్వాలలో పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి.. జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపత య్య కూడా అక్కడ ఛాన్స్‌ లేకుంటే ఇక్కడ గురిపెట్టినట్టు- సమాచారం. అలంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, దేవరకద్ర లో జీఎంఆర్‌, ప్రదీప్‌కుమార్‌ గౌడ్‌, సీత దయాకర్‌రెడ్డి, నారాయణ పేటలో శివకు మార్‌, కొడంగల్‌లో గుర్నాథ్‌ రెడ్డి, కల్వకు ర్తి వంశీచందర్‌ రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డి ఎన్నారై. వనపర్తి చిన్నారెడ్డి, మెగా రెడ్డి, కొల్లాపూర్‌ జూపల్లి కృష్ణారావు, షాద్‌నగ ర్‌లో యిర్లపల్లి శంకర్‌లు బరిలో ఉన్నారు.

భాజపా నుంచి బరిలో..
గద్వాలలో డీకే అరుణ, మహబూబ్‌ నగర్‌ జితేందర్‌ రెడ్డి, యన్నెం శ్రీనివాస్‌ రెడ్డి, పద్మజ రెడ్డి, జడ్చర్ల బాలాత్రిపుర సుం దరి, అలంపూర్‌ రాజగోపాల్‌, దేవరకద్ర డోకుర్‌ పవన్‌, యెగ్గని, నారాయణ పేట రతంగ్‌ పండు, సత్య యాదవ్‌, కల్వకుర్తి తల్లోజి ఆచారి, వనపర్తి కృష్ణ, కొల్లా పూర్‌ ఎల్గని సుధాకర్‌ రావు, అచ్చంపేట శ్రీకాంత్‌ బీమా, సతీష్‌ మాదిగ, షాద్‌నగర్‌ శ్రీవర్దన్‌ రెడ్డి, అందే బాబయ్య బరిలో ఉన్నారు.
అలంపూర్‌ నుండి బీఎస్పీ తరఫున ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పోటీ చేసే యోచనలో ఉన్నారు. మొత్తంగా రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరులో పోటీ ముక్కోణం కానుంది. అన్ని పార్టీలు సరాసరి రేసు గుర్రాలను బరిలో దింపనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement