Monday, April 29, 2024

శ్యామ్ సింగ‌రాయ్ నుండి లిరిక‌ల్ సాంగ్

శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం రేపు డిసెంబ‌ర్ 24న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్య‌న్ తెర‌కెక్కించారు. కాగా హీరో నాని, హీరోయిన్స్ గా సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి న‌టించారు. ఈ చిత్రాన్ని వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మించారు. 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా నుంచి ఒక్కో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. “తెరపైన కదిలేలా కథలేవో మొదలే .. తార నింగిదిగి నేల .. కింద నడిచేలా .. వచ్చేనిలా ” అంటూ ఈ పాట సాగుతోంది. నాని .. కృతి శెట్టిలపై చిత్రీకరించిన పాట ఇది. మిక్కీ జె మేయర్ బీట్ యూత్ ను పట్టుకునేలా ఉంది. కృష్ణకాంత్ సాహిత్యం .. కార్తీక్ ఆలాపన ఆకట్టుకుంటున్నాయి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement